సైరా చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌ను కలిసేందుకొచ్చిన తమను అడ్డుకున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ధర్నాకు దిగారు. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ముందు ఆందోళన చేపట్టారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్ర ఆధారంగా సైరా సింహారెడ్డి చిత్రం తెరకెక్కుతున్న విషయం విధితమే.
చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ఎదుట ఉయ్యాలవాడ వంశీయుల ధర్నా - chiramjeevi
హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఆందోళన చేశారు. రామ్‌చరణ్‌ను కలిసేందుకొచ్చిన తమను అనుమతించడం లేదంటూ ఉయ్యాలవాడ వంశీయులు ధర్నాకు దిగారు.
![చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ఎదుట ఉయ్యాలవాడ వంశీయుల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3706230-646-3706230-1561892589917.jpg)
The dharna of the Uyyalavada dynasty family before the Chiranjeevi Blood Bank
చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ముందు ఉయ్యాలవాడ వంశీయుల ధర్నా
ఉయ్యాలవాడ వంశీయులకు సాయం చేస్తానని గతంలో రామ్‌చరణ్ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. తిరుపతి ప్రసాద్ అనే వ్యక్తి తమను రామ్‌చరణ్ వద్దకు తీసుకెళ్లినప్పుడు తమకు సాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కాని ఇప్పుడు తమను రామ్‌చరణ్‌ను కలిసేందుకు అనుమతించడం లేదంటూ ఆరోపించారు. తమచేత డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని ఇప్పుడు మాట తప్పారంటూ నిరసన తెలిపారు. చిరంజీవి, రామ్‌చరణ్‌పై తమకు నమ్మకముందని కాని వారి మేనేజర్లే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Last Updated : Jun 30, 2019, 9:47 PM IST