తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వ్యాపారవేత్త జయరాం హత్యకేసు కొలిక్కి వస్తోంది. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కృష్ణాజిల్లా నందిగామకు తరలించినట్లు తెలుస్తోంది. అతనితో పాటు శిఖాచౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. హత్యలో శిఖాచౌదరి ప్రమేయం ఉందని రాకేష్‌రెడ్డి తండ్రి ఆరోపిస్తున్నారు.
జయరాం హత్యలో పోలీసుల ప్రమేయం..? - SHIKHA CHOWDARY
జయరాం హత్యకు ఎవరెవరు సహకరించారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్‌రెడ్డి కాల్‌డేటాలో పోలీసుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
జయరాం హత్యలో పోలీసుల ప్రమేయం..?
రాకేష్‌తో పాటు హత్యకు ఎవరెవరు సహకరించారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్‌రెడ్డి కాల్‌డేటాలో పోలీసుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. తెలంగాణకు చెందిన ఏసీపీ స్థాయి అధికారి ప్రమేయంపై విచారణ చేస్తున్నారు. హత్యకేసులో ప్రమేయం ఆరోపణలపై హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ను బదిలీ చేశారు. నిందితులను నేడు మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.