చంద్ర గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. అన్నప్రసాద వితరణ కేంద్రమూ ఆపేశారు. బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయం తెరవనున్నామని తితిదే అధికారులు తెలిపారు. ఆలయ శుద్ధి, ఇతర పూజలు పూర్తి చేశాక దర్శనానికి అనుమతిస్తామన్నారు.
దుర్గమ్మ తలుపులు..
విజయవాడ దుర్గగుడి తలుపులు మూసివేశారు. బుధవారం ఉదయం సుప్రభాతం, వస్త్ర సేవ, త్రికళార్చన రద్దు చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
సత్యనారాయణ స్వామి ఆలయం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు మూసివేశారు. పూజలు, దర్శనాలు నిలిపి వేసి, ఆలయ అధికారులు ద్వారాలు మూశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆలయంలో సంప్రోక్షణ చేసిన అనంతరం ఉదయం 9 గంటల నుంచి తిరిగి దర్శనాలు ప్రారంభిస్తారు.