బడ్జెట్‌లో నిధుల కోతకు నిరసనగా తెలుగుదేశం ఏం చేస్తుందంటే? - తెలుగుదేశం పార్టీ
బడ్జెట్‌లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులపై తెలుగుదేశం నిరసన చేపట్టింది. దీనికి నిరసనగా కోత తీర్మానాలు ప్రవేశపెట్టనుంది.
బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన అరకొర కేటాయింపులపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటికి నిరసన తెలుపుతూ కోత తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. నిరుద్యోగ భృతి రద్దుకు నిరసనగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కట్ మోషన్ ఇవ్వనున్నారు. మైనార్టీ శాఖకు గత ప్రభుత్వానికంటే కేటాయింపులు తగ్గించినందుకు కట్ మోషన్ ఇవ్వనున్నారు బాల వీరాంజనేయ స్వామి. అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రోత్సహాకాలను రద్దు చేసినందుకు వ్యతిరేకంగా వల్లభనేని వంశీ కోత తీర్మానం ఇవ్వనున్నారు. మద్యపాన నిషేధం విధిస్తామంటూ ఎక్సైజ్ శాఖ నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆశిస్తున్నందుకు ఆయన కట్ మోషన్ ఇస్తారు. అమ్మఒడి పథకం అమలుకు అవసరమైన నిధులు కేటాయించలేదని ఆదిరెడ్డి భవానీ తీర్మానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సాగునీటి ప్రాజెక్టు కేటాయింపులు తగ్గించినందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీర్మానం ఇస్తారు. రాజధాని నిర్మాణం కోసం కేవలం రూ. 500 కోట్లు కేటాయించినందుకు నిరసనగా కట్ మోషన్ ఇవ్వనున్న అనగాని సత్యప్రసాద్. రైతులకు వడ్డీ లేని రుణ పథకానికి కేవలం రూ. 100 కోట్లు కేటాయించినందుకు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు నిమ్మల రామానాయుడు. భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే బీమాను 2లక్షల నుంచి ఒక లక్ష నుంచి తగ్గించినందుకు నిరసన తెలియజేయనున్నారు వెలగపూడి రామకృష్ణ బాబు.