తెలంగాణ శాసనసభ నిర్మాణం వ్యవహారంపై ఈనెల 28నే హైకోర్టు విచారణ చేపట్టనుంది. నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్లోని చారిత్రక భవనాలు కూల్చివేయవద్దంటూ... పీహెచ్డీ విద్యార్థి శంకర్ నిన్న ఉన్నతన్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. త్వరలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నందున ఇవాళే విచారణ జరపాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి కోరారు. స్పందించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నాడు విచారణ చేపడతామని తెలిపింది. ఈ భవనాలపై మరోవ్యాజ్యం కూడా దాఖలైంది. సుమారు 150 ఏళ్ల నాటి భవనాలు కూల్చివేయకుండా ఆదేశాలు జారీ చేయాలని సామాజిక కార్యకర్త సార్వత్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానిపై కూడా శుక్రవారమే విచారణ జరిగే అవకాశం ఉంది.
ఎర్రమంజిల్ కూల్చివేతపై శుక్రవారం విచారణ - శాసన సభా నిర్మాణం వ్యవహారంపై కేసులు
సుమారు 150 ఏళ్ల నాటి అసెంబ్లీ భవనాలను కూల్చవద్దంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇవాళ విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా... ఉన్నత న్యాయస్థానం ఈనెల 28న విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.
telangana_high_court_examination_about_to_ruin_erramanjil