ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లక్షా ఎనభైవేల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌'

తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.

శాసనసభలో మాట్లాడుతున్న కేసీఆర్

By

Published : Feb 22, 2019, 1:47 PM IST

రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామన్న కేసీఆర్... తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని చెప్పారు. నీటిపారుదల... వ్యవసాయ శాఖలకు బడ్జెట్​లో అధిక నిధులు కేటాయించారు.

శాసనసభలో మాట్లాడుతున్న కేసీఆర్

కేటాయింపులు...
రైతు బంధు - రూ.12 వేల కోట్లు... రైతు బీమా - రూ.650 కోట్లు... వ్యవసాయ శాఖ -రూ.20,107 కోట్లు... నీటిపారుదలశాఖ – రూ.22,500 కోట్లు... ఆసరా పింఛన్లు - రూ.12,067 కోట్లు... బియ్యం రాయితీ - రూ.2,744 కోట్లు... కల్యాణ లక్ష్మి, షాది మూబారక్‌ - రూ.1450 కోట్లు... నిరుద్యోగ భృతి - రూ.1810 కోట్లు... మైనార్టీ సంక్షేమం - రూ.2004 కోట్లు... రైతు రుణమాఫీ - రూ.6 వేల కోట్లు... షెడ్యూలు కులాల ప్రగతి నిధి - రూ.16,581 కోట్లు... షెడ్యూలు తెగల ప్రగతి నిధి - రూ.9,827 కోట్లు... ఎంబీసీ కార్పొరేషన్‌ - రూ.వెయ్యి కోట్లు కేటాయించారు.

బడ్జెట్‌ స్వరూపం...
2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.
రెవెన్యూ వ్యయం -రూ.1,31,629 కోట్లు
మూలధన వ్యయం రూ.32,815 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు
ఆర్థిక లోటు అంచనా రూ.27,749 కోట్లు

ABOUT THE AUTHOR

...view details