ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగారా మోగక ముందే జాబితా! - ఎన్నికల మేనిఫెస్టో

ఎన్నికల నగారా మోగే లోపే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని తెదేపా పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టో పై కీలక చర్చ జరిగింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ముగిసిన తెదేపా పొలిట్ బ్యూరో భేటీ

By

Published : Feb 16, 2019, 6:27 PM IST

Updated : Feb 16, 2019, 6:53 PM IST

ముగిసిన తెదేపా పొలిట్ బ్యూరో భేటీ
అమరావతి ప్రజావేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెదేపా పొలిట్ బ్యూరో... కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల నగారా మోగే లోపే అభ్యర్థలు తొలి జాబితా ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. రేపటి నుంచే ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టాలని నేతలు నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడూ అంచనా వేసి తగు నిర్ణయాలు తీసుకునేందుకు రాజధాని అమరావతి వేదికగా ఓ వ్యూహ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభానికి ముందు పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సైనికులకు నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు ఆర్పించారు. ఈ ఘనటనలో మృతి చెందిన ప్రతి జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అనంతరం ఇటీవల ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని మరింత మెరుగ్గా తీర్చి దిద్దే అంశంపై ఎక్కువ సమయం చర్చించారు.
ఇటీవలే కాలంలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై పార్టీ సమావేశంలో లోతుగా చర్చించారు. కొందరూ స్వార్థ ప్రయోజనాలతో పార్టీని వీడుతున్నారని పొలిట్ బ్యూరో ఆక్షేపించింది. గెలుపు ప్రామాణికంగానే అభ్యర్ధుల ఎంపిక ఉండాలనే భావనకు వచ్చారు. వచ్చే ఎన్నికలకు రూపొందించే మేనిఫెస్టోపై కసరత్తు చేసినట్లు నేతలు వెల్లడించారు. కిందటి ఎన్నికల్లో పాదయాత్రలో ప్రస్తావించిన అంశాల నివేదికను పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేశారు.
ఈ సమావేశానికి తెలంగాణ తెదేపా నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి హజరయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలను తెలంగాణ తెదేపా నాయకత్వానికే అప్పగించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. మోదీ, కేసీఆర్, జగన్ భిన్నమైన పార్టీలుగా ఉన్నప్పటికి తెదేపాకు వ్యతిరేకంగా కలిసి పని చేస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు.

Last Updated : Feb 16, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details