ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈసీకి సీఎం లేఖ.. అందించిన తెదేపా బృందం - cm ramesh

పోలీసు ఉన్నతాధికారుల బదిలీల వి‍షయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఈసీకి రాసిన ఏడు పేజీల లేఖను తెదేపా ఎంపీలు ఈసీకి అందించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలను వాయిదా వేయాలని  కోరారు.

సీఎం ఏడు పేజీల లేఖను ఈసీకి అందించిన తెదేపా బృందం

By

Published : Mar 27, 2019, 7:33 PM IST

సీఎం ఏడు పేజీల లేఖను ఈసీకి అందించిన తెదేపా బృందం
పోలీసు ఉన్నతాధికారుల బదిలీల వి‍షయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఈసీకి రాసిన ఏడు పేజీల లేఖను తెదేపా ఎంపీలు ఈసీకి అందించారు.

ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసిన చరిత్ర దేశంలో ఇప్పటివరకు లేదని సీఎం రమేశ్ అన్నారు. అధికారులను బదిలీ చేస్తారని విజయసాయిరెడ్డి ముందే చెప్పడం... హత్య కేసు విచారణ చేస్తున్న ఎస్పీని బదిలీ చేయడంపలు అనుమానాలకు తావిస్తోందని జూపూడి అన్నారు. సీఎంకు రక్షణ ఇస్తున్న అధికారిని బదిలీ చేయడం సరికాదని రేపు సీఎంకు ఏమైనా అయితే ఈసీ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు.

ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉండాలని కోరామని ఎంపీ కనకమేడల తెలిపారు. ఎన్నికల పరిధిలోకి ఎవరు వస్తారనే దానిపై రాష్ట్రం గతంలోనే జాబితా ఇచ్చిందని కనకమేడల తెలిపారు. ఫారం-7పై మేం ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు.

ఎన్నికలు పూర్తయ్యేవరకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలను వాయిదా వేయాలని ఈసీని నేతలు కోరారు.

ఇవీ చూడండి.

ఈసీ పరిధిలోకి పోలీసు యంత్రాంగం...

ABOUT THE AUTHOR

...view details