ఇఫ్తార్ విందుకు ఆ ఎంపీ రాకపోవటంపై సర్వత్రా చర్చ! - tdp mp
సోమవారం తెలుగుదేశం పార్టీ విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు స్థానిక ఎంపీ కేశినేని హాజరుకాకపోవటం నేతల్లో చర్చకు దారితీసింది. అధినేత పర్యటన ముందుగానే నిర్ణయించినప్పటికీ నాని దిల్లీ పర్యటనలో ఉండటం వెనుక ఆంతర్యమేంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి
విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆ పార్టీ స్థానిక ఎంపీ కేశినేని నాని హాజరు కాకపోవటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అధినేత చంద్రబాబు హాజరయ్యే ఈ కార్యక్రమం ముందుగానే నిర్ణయించినప్పటికీ పార్లమెంట్ సమావేశాలు లేకుండా నాని దిల్లీ పర్యటనలో ఉండడం వెనుక ఆంతర్యమేంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన తెదేపా పార్లమెంటరీ సమావేశంలో గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు ఎంపీలైన గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేతగానూ, రామ్మోహన్ నాయుడును లోక్‌సభపక్ష నేతగానూ అధినేత చంద్రబాబు నియమించారు. ఈ నిర్ణయం పట్ల కేశినేని నాని మనస్థాపానికి గురయ్యారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి నాని దూరంగా ఉండటం అందరిలోనూ విస్తృత చర్చకు దారి తీసింది. నాని పార్టీ మారుతున్నారా అనే ప్రచారమూ సాగుతోంది.