'మహిళల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు' - tdp
మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై తెదేపా ఎమ్మెల్సీ మండలిలో ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా చినగంజాం ఘటనను ఆయన ప్రస్తావించారు. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హోంమంత్రిని ప్రశ్నించారు.
మహిళల భద్రతకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందనిశాసనమండలిలో తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా చినగంజాంలో తెదేపా కార్యకర్త పద్మ ఆత్మహత్యపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగారు. మచిలీపట్నంలో ఓ ఆశా కార్యకర్త… లేఖలో మంత్రి పేర్ని నాని పేరు రాసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై స్పందించాలని కోరారు. ప్రకాశం జిల్లాలో వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన ఘర్షణలో మనస్తాపానికి గురై పద్మ ఆత్మహత్య చేసుకుందని, ఆ ఘటనకు పార్టీ రంగు పులమరాదని హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.