ట్విట్టర్ వేదికగా అధికార పక్షంపై లోకేశ్ విమర్శలు కొనసాగుతున్నాయి. పాదయాత్రలో రైతుభరోసా అన్న జగన్... అధికారంలోకి వచ్చాక దగా భరోసా చేశారని తెదేపా జాతీయ కార్యదర్శి విమర్శించారు. ఏటా పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అంటే ఐదేళ్లకు 62,500లు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పుడు 6,500 రూపాయలే ఇస్తామని మాట మార్చారని మండిపడ్డారు.
' అప్పుడు రైతు భరోసా - ఇప్పుడు దగా భరోసా' - barosa
పాదయాత్రలో రైతు భరోసా కాస్తా... అధికారంలోకి వచ్చాక జగన్ దగా భరోసా అయ్యిందని ట్విట్టర్‌లో నారా లోకేశ్ విమర్శించారు. రైతులను నమ్మించి ఇప్పుడు దగా చేస్తున్నారని ఆరోపించారు.
lokesh
ఐదేళ్ళ సాయం ఇప్పుడు 32,500 లే అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఒక్క జే-టర్న్‌తో ఒక్కో రైతుకు 30,000ల రూపాయలు దగా చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న 64 లక్షల మంది రైతులను మోసం చేసి ప్రభుత్వం మిగుల్చుకునేది 19,200 కోట్లు అని ఆక్షేపించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఒక్క సంతకంతో 50వేల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసారని గుర్తు చేశారు. మిగిలిన రుణాలు దశలవారీగా మాఫీ చేస్తుంటే ... తమని నడిరోడ్డుమీద ఏదో చేయాలన్న జగన్‌ను ఇప్పుడేం చేయాలని ప్రశ్నించారు.