తెదేపా అభ్యర్థుల తొలి జాబితా - chandrababu
తెదేపా తరపున ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల చేశారు. తొలి విడతగా 126 మంది అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

ఏప్రిల్ 11న జరగబోయే అసెంబ్లీ ఎన్నకల్లో తెదేపా తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధినేత చంద్రబాబు విడుదల చేశారు. తొలివిరడతగా 126 మంది పేర్లు ప్రకటించారు.
రాష్ట్ర విభజన తర్వత ఐదేళ్లు కష్టపడి పనిచేసినట్టు చంద్రబాబు వివరించారు. మిషన్ 150 లక్ష్యంతో పార్టీ పనిచేస్తోందన్నారు. అభ్యర్థుల ఎంపికలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు వివరించారు. ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామన్నారు. పార్టీ టికెట్ దక్కనివారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కుల మతాలతో సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.