ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరోసారి ఈవీఎంల పనితీరుపై వ్యతిరేక గళం - గల్లా జయదేవ్

ఎన్నికల ముందు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన తెదేపా నేతలు మరోసారి వ్యతిరేక గళం వినిపించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్యనేతలు ఈవీఎంల పనితీరుపై మాట్లాడారు.

tdp_leaders_on_evm

By

Published : May 28, 2019, 4:40 PM IST

ఈవీఎంల పనితీరుపై తెదేపా నేతల గళం

ఈవీఎంల పనితీరుపై చాలామందికి సందేహాలున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజాతీర్పుని గౌరవిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఓటింగ్ కాకుండా ఇంకేదో జరిగిందనే అనుమానం అందరిలో ఉందని మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద రావు అన్నారు. తెదేపా ఓటమి అసహజమైనదిగా అభివర్ణించారు. తెదేపా ఓటమి నమ్మశక్యంగా లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. సాంకేతికంగా తెదేపాకు జరిగిన నష్టాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లి..ఉద్యమం చేపడతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీలో పోరాడతామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details