"నాలుగు పదాలు చదవలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు" - "నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు.. నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు"
సామాజిక మాధ్యమాన్ని ఆయుధంలా వాడుకుంటున్నారు తెదేపా నేత కేశినేని నాని. ఇటీవల ట్విట్టర్ వేదికగా తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. "నాలుగు పదాలు చదవలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు" అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
"నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు.. నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు"
తెదేపా నేత, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు... నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు" అంటూ తనదైన శైలిలో ట్విట్టర్లో పోస్టు పెట్టారు. "నాలుగు పదాలు చదవలేనివాడు... నాలుగు వాక్యాలు రాయలేనివాడు... ట్వీట్ చేస్తున్నాడు.. దౌర్భాగ్యం!" అని నాని చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Last Updated : Jul 14, 2019, 10:31 AM IST
TAGGED:
తెదేపా నేత కేశినేని నాని