తెదేపా అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో... పార్టీ నేత వరుపుల రాజా కలిశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని రాజా స్పష్టంచేశారు. చంద్రబాబు నాయకత్వంపై తనకు నమ్మకం ఉందన్న రాజా... కాకినాడ సమావేశం పార్టీకి వ్యతిరేకంగా జరిగింది కాదని తేల్చి చెప్పారు.
'తెదేపాలోనే ఉంటా... చంద్రబాబుతోనే నడుస్తా' - వరుపుల రాజా
ఇటీవల కాకినాడ పట్టణంలో జరిగిన సమావేశం పార్టీకి వ్యతిరేకంగా కాదని తెదేపా నేత రాజా వెల్లడించారు. గురువారం ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖంచించారు.
వరుపుల రాజా