40 ఏళ్ల అనుభవాన్ని వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు నలభై యేళ్ల పాటు ఒక్క తప్పూ చేయలేదన్నారు. ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగేటప్పుడు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ విమర్శైనా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని... విలువలు లేని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. 30 రోజుల్లో ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టారా అని ప్రశ్నించారు. విత్తనాలు, సాగునీరు లేక రైతులు పడుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలను కలిసేందుకు ప్రజావేదిక అడిగామని ఆయన తెలిపారు. ప్రజా వేదికను కూలుస్తారని తెలిస్తే ... అసలు అడిగేవాళ్లమే కాదన్నారు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూలుస్తామని నోటీసులిచ్చారన్నారు. ఈ భవనాన్ని గ్రామ పంచాయతీ అనుమతి తీసుకునే నిర్మించారని అచ్చెన్నాయుడు తెలిపారు.
'ప్రజావేదిక కూలుస్తారంటే అడిగేవాళ్లం కాదు' - వైకాపా నేతలు
ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలను కలిసేందుకు ప్రజావేదిక అడిగామని.. కూలుస్తారని తెలిస్తే అడిగేవాళ్లమే కాదని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు.
అచ్చెన్నాయుడు