వైఎస్ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ సామాజికవర్గ నేతలు రామానాయుడు ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం కాపులకు ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం ఇచ్చే ప్రయత్నం చేసిందన్న రామానాయుడు... సీఎం జగన్ ఏ ప్రయత్నం చెయ్యకుండానే కాపులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈబీసీ కింద కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా లేదా సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోంది: తెదేపా - TDP Kapu Leaders
ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోందని తెదేపా నేత రామానాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలోనూ కాపులపై చిన్నచూపు చూశారని... జగన్ సైతం అదే చేస్తున్నారన్నారు.
![ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోంది: తెదేపా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3858346-42-3858346-1563289356808.jpg)
రామానాయుడు