పాత పథకాలకే కొత్త ముసుగు: యనమల - yanamala
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై తెదేపా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
నవరత్నాల పేరుతో కోతలు విధించారని, నవ రద్దులు చేశారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ బడ్జెట్లో రద్దు చేసినవి, పేర్లు మార్చిన పథకాలు ఎన్నో ఉన్నాయన్నారు. పథకాలు రద్దు చేసి, పేర్లు మార్చి ప్రజల మనసుల నుంచి తెదేపాను తొలగించలేరని స్పష్టం చేశారు. ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు తగ్గించారని ఆరోపించారు. రద్దు చేసిన పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేస్తున్నారని తెలిపారు. రీ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలుపుతున్నారని యనమల మండిపడ్డారు.