నేడు యూపీఎస్సీ సివిల్స్ ప్రాథమిక పరీక్ష - upsc
నేడు యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో 4 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో 4 నగరాల్లో సివిల్స్ ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తున్నారు. విజయవాడ నగరంలో 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9వేల 872 మంది అభ్యర్థులు నగరంలో పరీక్షకు హాజరుకానున్నారు. ఈ రోజు ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30నిమిషాల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల నుంచి 4గంటల 30నిమిషాల వరకు రెండో పరీక్ష నిర్వహించనున్నారు. 22 పరీక్ష కేంద్రాల్లో 876 మంది ఇన్విజిలేటర్లు, 85మంది అసిస్టెంట్ సూపర్ వైజర్లు సహా ఇతర సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పరీక్షా సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉండడంతో పరీక్షకు అరగంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు.