ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సభ సారథులు తమ్మినేని సీతారాం... కోన రఘుపతి

ముఖ్యమంత్రి జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లకు అవకాశమిచ్చారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కింది. స్పీకర్​గా తమ్మినేని సీతారాం... డిప్యూటీ స్పీకర్​గా కోన రఘుపతికి అవకాశం వచ్చింది.

తమ్మినేని సీతారాం... కోన రఘుపతి

By

Published : Jun 8, 2019, 6:12 AM IST

స్పీకర్​గా తమ్మినేని సీతారాం...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను శాసనసభ స్పీకర్​గా ఎంపిక చేశారు. కళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని... ఇప్పటికి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రిగా పనిచేసిన సీతారాం స్పీకర్​గా సరిపోతారని జగన్ భావించారు. ఆముదాలవలసకు చెందిన తమ్మినేని సీతారాం... 1955 జూన్ 10న జన్మించారు. బీఏ చదువుకున్న ... ఆమదాలవలస నుంచి 1994, 1999, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 1985, 1991లో జరిగిన ఉపఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1994లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో యువజన సర్వీసుల మంత్రిగా పనిచేశారు. 1995లో చంద్రబాబు మంత్రివర్గంలో మున్సిపల్ శాఖామంత్రిగా... 1997లో చంద్రబాబు కేబినెట్​లో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు.

ఉప సభాపతిగా కోన రఘుపతి...
గుంటూరు జిల్లా బాపట్ల నుంచి గెలుపొందిన కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్‌ పదవి వరించింది. 2014లో తొలిసారి బాపట్ల నుంచి గెలిచిన కోన... గతంలో చిన్నతరహా పరిశ్రమల సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తన తండ్రి పేరిట ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి... సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన రఘుపతికి... ఉపసభాపతిగా అవకాశం ఇచ్చారు జగన్.

ABOUT THE AUTHOR

...view details