ప్రశ్నలకు జవాబులు సరిగ్గా రాసినా సున్నా మార్కులు వేయడం ఏంటని విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ను ప్రశ్నించారు. దానికి ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. సున్నా వేయడం వాళ్ల హక్కు అని అన్నారు. దీనిపై చర్చ చేస్తారా అంటూ విద్యార్థులపై మండిపడ్డారు. సున్నా వేసిన దాన్ని మేం మార్చలేమని స్పష్టం చేశారు. వాల్యూయేషన్ చేసిన మార్కులను మళ్లీ మార్చలేమని అన్నారు. పునఃమూల్యాంకనం చేసినా సున్నా వస్తే ఇంకా అంతే... ఫేయిల్ అయినట్లేనని అన్నారు.
'సున్నా వేయడం వాళ్ల హక్కు... అంతే వేస్తాం' - inter issue
పునఃమూల్యాంకనంలోనూ తెలంగాణ ఇంటర్ బోర్డు అదే నిర్లక్ష్యం వ్యవహరించింది. సమాధానాలు సరిగ్గా రాసినా... ఫెయిల్ చేశారని విద్యార్థులు ప్రశ్నిస్తే... 'నేను ఇంటర్ బోర్డు కార్యదర్శిని నాతోనే వాదిస్తారా?' అంటూ తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ వారిపై మండిపడ్డారు. సున్నా వస్తే అంతే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
'సున్నా వేయడం వాళ్ల హక్కు... అంతే వేస్తాం'
ఇంటర్ బోర్డు కార్యదర్శిని నాతోనే వాదిస్తారా అంటూ వారిపై గరమయ్యారు. మీ పేర్లు చెప్పండి... ఐడీ కార్డులివ్వండి అంటూ భయాందోనకు గురిచేశారు. తాను జవాబుదారిని కానని అశోక్ కుమార్ స్పష్టం చేశారు. దీన్ని ఓ విద్యార్థి వీడియో తీశాడు.
ఇదీ చదవండి:కీలకమైన పదవుల్లో సమర్థులైన అధికారులు..!?
Last Updated : May 29, 2019, 11:15 AM IST