రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత అల్లాడిస్తున్నాయి..ఇంటి నుంచి బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. వివిధ జిల్లాలో ఇప్పటి వరకు వడదెబ్బకు 9 మంది చనిపోయారు. ఒక్క తూర్పుగోదావరిలోనే నలుగురి మరణించారు. సోమవారం గరిష్టంగా కృష్ణాజిల్లా దొనబండలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 10 నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం, విపత్తు నిర్వహణ సంస్థ వివరించాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
భానుడి భగభగలు...విలవిల్లాడుతున్న జనాలు
రాష్ట్రంలో నిప్పుల కొలిమిగా తలపించే ఎండలకు వడగాల్పులు తోడయ్యాయి..ఈ ఉష్ణోగ్రతలకు ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటి వరకు వడదెబ్బకు 9 మంది చనిపోయారు.
భానుడి భగభగలు...విలవిల్లాడుతున్న జనాలు