రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరువలో ఉన్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. చిత్తూరు జిల్లా రేణిగుంటలో అత్యధికంగా 46 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీలు, మరో 50 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆర్టీజీఎస్ ప్రకటించింది.
భానుడి భగభగ.. సామాన్యుడికి ఎండల సెగ - ఆర్టీజీఎస్
రోహిణి కార్తె ఎండలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత, వడగాల్పులతో పగటి పూటి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల చేరువలో ఉన్నాయని ఆర్టీజీఎస్ కేంద్రం తెలిపింది. ఇవాళ చిత్తూరు జిల్లా రేణిగుంటలో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంపై భానుడి ప్రతాపం
4 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు
నెల్లూరు జిల్లా | ఉష్ణోగ్రత (డిగ్రీలలో) |
రాపూరు | 46 |
బోగోలు | 45 |
కలిగిరి | 45 |
చిల్లకూరు | 45 |
నాయుడుపేట | 44 |
చిత్తూరు జిల్లా | ఉష్ణోగ్రత (డిగ్రీలలో) |
రేణిగుంట | 46 |
వరదయ్యపాలెం | 46 |
బుచ్చినాయుడికండ్రిగ | 45 |
ఏర్పేడు | 45 |
చంద్రగిరి | 44 |
శ్రీకాళహస్తి | 44 |
ప్రకాశం జిల్లా | ఉష్ణోగ్రత (డిగ్రీలలో) |
పెదచెర్లోపల్లి | 45 |
బల్లికురవ | 45 |
కురిచేడు | 45 |
వెలిగండ్ల | 44 |
గుంటూరు జిల్లా | ఉష్ణోగ్రత (డిగ్రీలలో) |
దాచేపల్లి | 45 |
ఇవీ చూడండి :జిప్‌లైన్'తో విన్యాసాల అడ్డాగా ఈఫిల్ టవర్
Last Updated : May 29, 2019, 8:39 PM IST