ఏపీపీఎస్సీ తీరుపై విద్యార్థి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. గతంలో ప్రకటించిన 33 నోటిఫికేషన్లలో 14 పరీక్షలకు జనరల్ స్టడీస్ పేపర్‌ను ఆంగ్లంలో నిర్వహిస్తుండటంపై ఆగ్రహించాయి.
ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించారు.
By
Published : Mar 6, 2019, 8:39 PM IST
నిరుద్యోగుల ఆందోళన
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలన్నీ తెలుగులోనూ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ... విజయవాడలోవిద్యార్థులు ఆందోళన చేశారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జీవో 5 వల్ల నిరుద్యోగులు తీవ్రంగానష్టపోతున్నారని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా... మాతృ భాషలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.