ఎగ్జిట్ పోల్స్ అంటే...
పోలింగ్ జరిగే రోజు... ఓటు వేసి బయటకు వచ్చిన కొందరిని ఎవరికి ఓటేశారు..? ఏ పార్టీకి ఓటేశారు అనే ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 10 పోలింగ్ కేంద్రాలు ఎంపిక చేసుకుంటారు. వాటిల్లో ఓటు వేసి వచ్చేవారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఎక్కువలో ఎక్కువ ఒక నియోజకవర్గంలో వెయ్యిమంది అభిప్రాయాలు తెలుసుకుంటారు. అందులో యువకులు, వృద్ధులు, మహిళలు, పురుషులు అనే తేడా ఉండదు. ర్యాండమ్‌గా అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయంగా జరగవు. అందుకే చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయి.
ఎగ్జిట్ పోల్సే... ఎగ్జాక్ట్ 'పల్స్' కాదు..!? - ap politics
ఎన్నికలు ముగిసిన మరుక్షణమే చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంటూ తమతమ అంచనాలు వెల్లడించాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామందికి వాటిపై నమ్మకం సన్నగిల్లుతోంది. అసలు ఎగ్జిట్ పోల్స్‌కు సర్వేలకు ఉన్న తేడా ఏంటీ... ఎగ్జిట్ పోల్స్‌లో ఓటర్ల అభిప్రాయాలు ఎలా సేకరిస్తారు... సర్వేలో ప్రజల నాడి ఎలా పసిగడతారు అనే విషయాలు చాలామందికి తెలియక... ఎగ్జిట్ పోల్స్‌నే ఎగ్జాక్ట్ 'పల్స్' అనుకుంటారు.
సర్వే ఇలా చేస్తారు...
ఎగ్జిట్ పోల్స్లా కాకుండా సర్వేను శాస్త్రీయంగా చేస్తారు. అంటే ఎన్నికల ముందే ప్రతీ నియోజకవర్గంలో ఒకసారి సర్వే చేస్తారు. ఈ సర్వేలో ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 1500 నుంచి 2వేల మంది అభిప్రాయాలు సేకరిస్తారు. ఎన్నికలు ముగిశాక మరోసారి చేస్తారు. ఈ రెండింటిని పోల్చి అంచనాలు వెల్లడిస్తారు. సర్వేలో ప్రస్తుత అధికార పార్టీ పనితీరు, పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, నేతల పనితీరు, మళ్లీ ఎవరు మీ ప్రతినిధిగా ఉండాలి వంటి వాటి గురించి గురించి క్లుప్తంగా తెలుసుకుంటారు. సర్వే సంస్థ ప్రతినిధులు ఒక్కొక్కరిని 15 నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. దీనిని శాస్త్రీయ సర్వే అంటారు. సర్వేల అంచనాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పోలిస్తే కచ్చితంగా ఉంటాయి.
ఒక్క లగడపాటి మినహా...
ఈసారి... ఒక్క లగడపాటి రాజగోపాల్ మినహా అందరూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే వెల్లడించారు. లగడపాటి మాత్రమే శాస్త్రీయ సర్వే చేయించారు. కొన్ని పార్టీలకు వారివారి అనుకూల మీడియా సంస్థలు అతిఎక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అవన్నీ శాస్త్రీయంగా జరిగిన సర్వేలు కావు.