ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చట్టపరిధిలోనే చంద్రబాబుకు భద్రత కల్పించాం'

ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రత విషయంలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. చట్టపరిధిలో నిర్ణయం తీసుకున్నా కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.

మీడియాతో మాట్లాడుతున్న హోంమంత్రి

By

Published : Jun 28, 2019, 6:50 PM IST

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గింపు అంశంపై హోం మంత్రి మేకతొటి సుచరిత స్పందించారు. చట్ట పరిధిలోనే ఆయనకు భద్రత ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏ కేటగిరి వ్యక్తులకు ఎంత భద్రత ఇవ్వాలనేది భద్రతా సమీక్షా కమిటీ నిర్ణయిస్తుందని వివరించారు. ఎవరూ కక్షపూరిత నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details