'జలశక్తి అభియాన్ను విజయవంతంగా అమలు చేస్తాం' - jalashakthi abhiyaan
జలశక్తి అభియాన్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి కేంద్ర కేబినేేట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చర్చించారు. భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
జల సంరక్షణే ధ్యేయంగా కేంద్రం జూలై 1 నుంచి తలపెట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమాన్నిరాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంచెప్పారు. కార్యక్రమ అమలుపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సహా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి పురపాలక, జలవనరుల శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశంలో తాగు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 255 జిల్లాల్లోని 10 వందల 92 బ్లాకుల్లో జలశక్తి అభియాన్ చేపడతామని సిన్హా తెలిపారు. మొదటి దశను జూలై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు,రెండో దశను అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకూ నిర్వహిస్తామని వివరించారు. ఇంకుడు గంతలు, వాటర్ షెడ్లు, కొండ ప్రాంతాల్లో గల్లీ ట్రెంచింగ్ వంటి పనులు పెద్దఎత్తున చేపట్టాలని కోరారు. ప్రతినీటి బొట్టును భూమిలో ఇంకింపజేసి భూగర్భ జలమట్టం పెంచేలా చర్యలు తీసుకుంటామని ఎల్వీ సుబ్రమణ్యం వివరించారు. రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ అధికారిని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పర్యవేక్షణకు ఇద్దరు ఇంఛార్జి అధికారుల్ని నియమిస్తామని తెలిపారు..