ఎన్నికలకు సిద్ధం.. అర్హులు స్వేచ్ఛగా ఓటేయాలి! - ఏపీ ఎన్నికలు 2019
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లుండే పోలింగ్ జరగనుంది. అర్హులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగుస్తోంది. ఎల్లుండే ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్‌కు ఎన్నికల సంఘం సిద్ధమైంది. సమస్యాత్మక ప్రాంతాలకు ప్రత్యేక బలగాలను తరలించింది. ప్రవర్తనా నియమావళి విషయంలో అభ్యర్థులు తమకు సహకరించాలని ఈసీ కోరింది. అర్హులైన వారంతా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ఏర్పాట్లు, ఓటర్లకు సూచనల వంటి మరిన్ని వివరాలపై... ద్వివేదితో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి.