రాష్ట్రంలో ఓట్ల తొలగింపు అంశంపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పందించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థలో దొరికిన ఓటరు జాబితా అందరికి అందుబాటులో ఉండేదేనని ద్వివేది స్పష్టం చేశారు. ఆ జాబితాను ప్రజలెవరైనా తీసుకునే వీలుందని వెల్లడించారు. వీటిపై వచ్చే రాజకీయారోపణలతో ఎన్నికల కమిషన్కు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఓటరు జాబితాకు అనుసంధానించే సమాచారంలో ఆధార్, బ్యాంకు ఖాతా, ప్రజా సంక్షేమ పథకాల వివరాలు ఉండవని తేల్చిచెప్పారు.
'రాజకీయారోపణలతో సంబంధం లేదు' - AP LATEST NEWS
ప్రతి నియోజకవర్గంలో సగటున 300 ఓట్ల వరకు తొలగింపు దరఖాస్తులు రావడం సర్వ సాధారణమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. రాజకీయ పార్టీలు చేసే ఆరోపణలతో ఎన్నికల కమిషన్కు ఎలాంటి సంబంధంలేదని... ఐటీ గ్రిడ్స్ సంస్థలో దొరికిన ఓటరు జాబితా అందరికి అందుబాటులో ఉండేదేనని ద్వివేది స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది
రాష్ట్రవాప్యంగా ఉన్న 45వేల మంది బూత్ స్థాయి అధికారుల్లో ఎవరో ఒకరు పొరపాటు చేసే అవకాశం ఉందన్నారు. ఆ ఉద్యోగులు తప్పు చేసినా... క్రిమినల్ చర్యలతో పాటు సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ఎవరు తప్పుచేసినా కఠినంగా వ్యవహరిస్తామని ద్వివేది అన్నారు. తమకు వచ్చిన వినతుల్లో మృతులు, బదిలీలకు సంబంధించిన ఫారం-7 దరఖాస్తులూ ఉన్నాయన్నారు. వారం క్రితం వరకు రోజుకు లక్ష దరఖాస్తులొచ్చాయని... ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.