ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టోకెన్ పద్ధతిలో ఓటింగ్.. క్యూలైన్లు పోయినట్టే! - elections

రానున్న ఎన్నికల్లో ఓటు వేయటానికి క్యూలైన్లో నిలబడాల్సిన పనిలేదన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. టోకెన్ తీసుకుని మీకిచ్చిన సమయంలో వచ్చి ఓటేసుకోవచ్చని ఆయన అన్నారు.

గోపాలకృష్ణ ద్వివేది

By

Published : Feb 8, 2019, 9:30 PM IST

రాజకీయ పార్టీ నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది భేటీ అయ్యారు. జిల్లాల్లో ఈవీఎంల మొదటి దశ తనిఖీల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. జనవరి వరకు 3.69 కోట్ల మంది ఓటు నమోదు చేసుకున్నారన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందన్నారు.

నకిలీ ఓటరు జాబితాపై 15 రోజుల్లో స్పష్టతనిస్తామన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ వరుసలు లేకుండా టోకెన్ పద్ధతి తీసుకొస్తామన్నారు.

రాజకీయ పార్టీ నేతలతో చర్చిస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

రాష్ట్రంలో 18 సంవత్సరాల వయసు నిండినవారు 18 లక్షలమంది ఉన్నారన్నారు. అందులో 5.5 లక్షల మందే ఓటు నమోదు చేసుకున్నారని ద్వివేది చెప్పారు. మిగిలిన వారూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details