ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టు సమస్యలపై బుగ్గన నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ - ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

రాష్ట్రంలో నక్సల్స్ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనపై మంత్రి వర్గ ఉపసంఘం ఆర్థికమంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటుచేశారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

By

Published : Jul 15, 2019, 4:38 PM IST

రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం ఉంటుంది. హోం, రెవెన్యూ, గిరిజన సంక్షేమం, రహదారులు భవనాల శాఖ సభ్యులుగా ఇందులో ఉంటారు. లొంగిపోయిన నక్సల్స్ పునరావాసం, తీవ్రవాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపులో విధాన రూపకల్పన, ధ్వంసం అయిన ఆస్తులకు పరిహారం తదితర అంశాల్లో మంత్రి వర్గ ఉపసంఘం సమీక్షించనుంది. నక్సల్స్ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు. ఈ కమిటీ సిఫార్సులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి... అమలు చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details