ఈసీని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలు, వ్యవస్థలను నాశనం చేయాలని చూడకూడదని హితవు పలికారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి. భాజపాకు మద్దతిచ్చే వారు ఏమైనా చేయొచ్చు.. భాజపాయేతర ప్రభుత్వాలన్నీ కుప్పకూలిపోవాలా? అని ప్రశ్నించారు. ఈసీ, ఈడీ, సీబీఐ, ఐటీని గుప్పిట పెట్టుకుని చక్రం తిప్పడం సరికాదని విమర్శించారు. ఇలాంటి భ్రష్టు రాజకీయాలు చేసేవారిని ఇప్పటివరకు చూడలేదని తెలిపారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలు తెలియనివారు చంద్రబాబును విమర్శిస్తున్నారన్నారు. రాష్టంలో ప్రజలకు లబ్ధి చేకూరే నిర్ణయాలు తీసుకోకూడదు...మోదీ మాత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశాలు పెట్టుకోవచ్చా? అని ప్రశ్నించారు.
'ప్రభుత్వం పాలన చేయకూడదనేదే వారి ఉద్దేశం' - tdp
కిరణ్కుమార్ రెడ్డి రాజీనామా చేశాక ఆపద్ధర్మ సీఎంగా చేసేందుకు అంగీకరించలేదని... ఆ సమయంలో రాష్టపతి పాలన వచ్చిందని మంత్రి సోమిరెడ్డి అన్నారు. అమరావతిలో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై ధ్వజమెత్తారు.
'ప్రజా ప్రభుత్వం పాలన చేయకూడదనేదే వారి ఉద్దేశం'
సార్వత్రిక ఎన్నికల్లో రౌడీయిజం చేశారని..హింసను ప్రేరేపించారని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో రాత్రి తర్వాత అంతటా గొడవలు సృష్టించారని తెలిపారు. అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చూపించారని విమర్శించారు. ఎలా ఉంటుందో మరోసారి చూపించారన్నారు. రాకూడదనే ప్రజలు అధిక సంఖ్యలో ఓట్లేశారని పేర్కొన్నారు. పరిపాలన సజావుగా సాగుతుంటే సంతోషపడాలని హితవు పలికారు.
Last Updated : Apr 23, 2019, 4:17 PM IST