చంద్రయాన్-2 ప్రయోగం కొత్త ఉత్సాహం నింపిందని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో చరిత్రాత్మక రోజు అని కొనియాడారు. చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమే అని... మరెన్నో విజయాలు అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నా... గుర్తించిన వారంలోనే పరిష్కరించామని శివన్ అన్నారు.
శాస్త్రవేత్తలు అందరూ 24 గంటలూ తదేక దీక్షతో పనిచేశారని...ప్రతిక్షణం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామని శివన్ తెలిపారు. శాస్త్రవేత్తల అంకితభావం, కృషి ఇస్రోకి విజయాన్ని అందించిందన్నారు.
లాంఛ్ వెహికల్ టీమ్ అత్యంత సునిశిత పరిజ్ఞానంలో విజయం సాధించింది. చంద్రయాన్ -2 ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ నిష్ఠతో పని చేశారని తెలిపారు.