ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫొని తుపాను ... 3న పూరీ దగ్గర తీరం దాటే అవకాశం - పూరీ

ఫొని.. పెను తుపానుగా మారి... మే 3 మధ్యాహ్నం పూరీకి దక్షిణంగా తీరం దాటనుంది. గోపాల్‌పూర్‌ - చాంద్‌బలి మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం దాటే సమయంలో 205 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 21 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదులుతోందితుపాను.

పెను తుపానుగా ఫొని...పూరీ దగ్గర తీరం దాటే అవకాశం

By

Published : Apr 30, 2019, 5:05 PM IST

Updated : May 1, 2019, 7:54 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుపాను ఫొని మరింత తీవ్రరూపం దాల్చనుంది. ఈ రాత్రిలోగా తీవ్ర పెనుతుపానుగా మారే సూచనలున్నట్టు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని.. గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ సాయంత్రానికి క్రమంగా దిశమార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపునకు కదులుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖకు 560 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 760 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

పెను తుపానుగా ఫొని...పూరీ దగ్గర తీరం దాటే అవకాశం

పెనుతుపాను ఫొని దిశమార్చుకుని తూర్పు తీరం వెంబడి ఒడిశా, బంగ్లాదేశ్ వైపు ప్రయాణిస్తున్నట్టు ఐఎండీ వెల్లడించింది. తుపాను కేంద్రకం నుంచి ఇది విస్తరించిన ప్రాంతం దాదాపు 400 నుంచి 500 కిలోమీటర్ల మేర ఉంటుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. మే రెండో తేదీ నుంచి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని ఐఎండీ స్పష్టం చేస్తోంది. తుపాను కదులుతున్న ప్రాంతంలో ప్రస్తుతం 170 నుంచి 195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయని సముద్రం అల్లకల్లోలంగా ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పెనుగాలుల తీవ్రత కారణంగా సముద్రంలో అలల ఎత్తు బాగా పెరిగినట్టు ఇన్కాయిస్ తెలియచేసింది. అలల ఎత్తు దాదాపు 19 అడుగుల మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లకు చెందిన మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అన్ని తీరప్రాంత జిల్లాలకు చెందిన కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలోని రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం, స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.

ఇవి చూడండి...ఫొని ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర సాయం 1,086 కోట్లు

Last Updated : May 1, 2019, 7:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details