రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. బియ్యం సేకరణ సహా సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బడ్జెట్ తదితర అంశాలపై చర్చించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్న బాబు, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథ రాజు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, పౌర సరఫరాలశాఖ , సీఎంవో అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.
6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. దీన్ని మిల్లర్లు, రైతుల ద్వారా ఎలా సేకరించాలి.. ఏ తరహా విధానాలను అవలంభించాలని చర్చించారు. వీలైనంత త్వరలో అన్ని ఏర్పాట్లు చేసి సెప్టెంబర్1 నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. వినూత్న విధానాలు తీసురావడం సహా... కల్తీ లేని నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయడమే తమ లక్ష్యమన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం
సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం
ఇదీ చదవండి...'బద్వేల్ తాగునీటి పథకం అభివృద్ధి చేయండి'