గుంటూరు జిల్లాలోని 2 కేంద్రాల్లో రీ పోలింగ్?? - ec
గుంటూరు జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాల పరిధిలో మళ్లీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు... సీఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని 2 పోలింగ్ కేంద్రాల్లో.. రీ పోలింగ్ కు సీఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. గుంటురు పశ్చిమ నియోజకవర్గం 244 వ కేంద్రం, నరసరావుపేటలోని 94 వ కేంద్రంలో మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు ప్రతిపాదన పంపినట్టు వెల్లడించారు. గుంటూరు కలెక్టరు చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్న ద్వివేది.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు.