ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేసు నుంచి తప్పుకున్న రాయపాటి!

''కాంగ్రెస్​లో ఉంటే చక్రం తిప్పేవాడిని. చాలా మందికి టికెట్లు ఇప్పించేవాడిని. తెదేపాలో నేను చాలా జూనియర్​ను. మా అబ్బాయికి అవకాశం ఇచ్చారు. నేను స్పచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకొంటున్నా. చంద్రబాబును సీఎంగా చూడాలని ఉంది'' - రాయపాటి సాంబశివరావు, నర్సరావుపేట ఎంపీ

రాయపాటి సాంబశివరావు

By

Published : Mar 18, 2019, 5:48 PM IST

రాయపాటి సాంబశివరావు
తెదేపా టిక్కెట్ల కేటాయింపులో కొత్త మలుపు చోటుచేసుకుంది. నర్సరావుపేట లోక్​సభ స్థానం పోటీ నుంచి సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావు తప్పుకొన్నారు. తన కుమారుడు రంగారావుకు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానం కేటాయిస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నట్లు రాయపాటి గుంటూరులో తెలిపారు. పార్టీ నిర్ణయంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని.. పార్టీ కోసమేపనిచేస్తానని చెప్పారు.

రాయపాటికి టికెట్ కేటాయింపు సమయంలోనూ.. హైడ్రామా నడిచింది. కిందటి ఎన్నికలకు ముందు తెదేపాలో చేరిన రాయపాటికి అధిష్టానం నరసరావుపేట టికెట్ కేటాయించడంతో ఆయన అక్కడి నుంచి గెలుపొందారు. ఈ సారి ఆయనతో పాటు ఆయన కుమారుడు రంగారావు కూడా అసెంబ్లీ స్థానం కోసం ప్రయత్నాలు చేశారు. ఇరువురికీ టికెట్ కేటాయించే పరిస్థితి లేదని చెప్పడంతో పాటు.. తన అభ్యర్థిత్వాన్ని త్వరగా తేల్చడం లేదంటూ.. రాయపాటి పార్టీ నాయకత్వంపై అలక వహించారు. చివరకు నర్సరావుపేట స్థానానికి తెదేపా ఆయన పేరునే ప్రకటించింది. ఆయన కుమారుడు రంగారావుకు ఇంకా ఎక్కడా టికెట్ కేటాయించలేదు.

అయితే... ఇవాళ తన కుమారుడికి తెదేపా.. గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయించిందని చెప్పిన రాయపాటి తాను నర్సరావుపేట బరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ టికెట్ ను తెదేపా మద్దాల గిరికి కేటాయించింది. మద్దాల గిరికి మరోచోట టికెట్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. రాయపాటి తప్పుకుంటే నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగానే ఉంది.

ABOUT THE AUTHOR

...view details