రైల్వే జోన్‌కు పచ్చజెండా - విశాఖకు రైల్వే జోన్
రాష్ట్ర ప్రజల కల నెరవేరింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. విభజన సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కేంద్రం కాసేపటి క్రితమే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించింది.
![రైల్వే జోన్‌కు పచ్చజెండా](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2566693-842-706a55e7-7103-40e6-a435-a413f527bf87.jpg)
visaka railway zone
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచింది. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రజల డిమాండ్‌ను ఎలుగెత్తింది. జోన్ విషయంలో ఇన్నాళ్లూ మీనమేషాలు లెక్క పెట్టిన కేంద్రం... చివరికి రాష్ట్ర ప్రజల న్యాయమైన డిమాండ్‌ను గౌరవించింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న తరుణంలో... విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించింది.
Last Updated : Mar 1, 2019, 3:49 PM IST