చంద్రబాబు దీక్షా శిబిరానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపిన రాహుల్‌గాంధీ. ప్రధానిగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా... వద్దా అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని విమర్శించారు. దేశ ప్రధానిగా ఒక మాట చెప్పారంటే అదీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలని సూచించారు.
ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగంకాదా...అని ప్రశ్నించారు. ప్రధాని ఎక్కడికెళ్తే అక్కడి పాటే పాడతారని ఎద్దేవా చేశారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండానే అబద్ధాలు చెబుతారని విమర్శించారు.
ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని... ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల నిధులను దోచి అంబానీకి కట్టబెట్టారాని రాహుల్‌గాంధీ ఆరోపించారు.