జగన్ చరిత్ర సృష్టించబోతున్నారు: పీవీపీ - పీవీపీ
రాష్ట్రంలో జగన్ చరిత్ర సృష్టించబోతున్నారని విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ జోస్యం చెప్పారు. ఎన్నికల వేళ తనపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేసినవారిపై చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు.
వ్యక్తిగత దూషణలు చేసే వారిని రోడ్డుపైకి లాగాలి: పీవీపీ
వ్యక్తిగత దూషణలు చేసే... వ్యక్తులు, వ్యవస్థలను కచ్చితంగా రోడ్డుపైకి లాగాల్సిందేనని విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. ఎన్నికల వేళ తనపై ఆరోపణలు చేసిన వ్యక్తులు...వారి వద్ద ఏ ఆధారాలున్నాయో బయటపెట్టాలని పీవీపీ డిమాండ్ చేశారు. మే 23న రాష్ట్రంలో సునామీ రాబోతుందని... వైకాపా అధినేత జగన్ చరిత్ర సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు.