ప్రజావేదిక కూల్చివేయడం సరికాదు: పురంధేశ్వరి - పురంధేశ్వరి
ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై భాజపా ఎప్పూడూ మాట మార్చలేదని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సీఎం జగన్‌కు సూచించారు.
ప్రత్యేక హోదాపై తప్పుదోవ పట్టించొద్దు: పురంధేశ్వరి
ఆంధ్రాకు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపారు. ప్రత్యేక హోదాపై ఆదినుంచీ తమ పార్టీ ఒకే మాటపై ఉందని చెప్పారు. హోదా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చకుండా ప్రజల కోసం ఉపయోగిస్తే బాగుండేది ఆమె అభిప్రాయ పడ్డారు.
Last Updated : Jun 27, 2019, 3:04 PM IST