అమరావతిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ అగ్ర నేతలు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రజావసరాల కోసం.. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామంటూ ప్రభుత్వం చెప్పడాన్ని నేతలు తప్పుపట్టారు. చట్ట ప్రకారం, తగిన అనుమతులతోనే ప్రజావేదికను నిర్మించామన్నారు. అక్రమ కట్టడమైతే కలెక్టర్ల సదస్సు ఎందుకు నిర్వహించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలనుంచి వినతులను స్వీకరించేందేందుక ప్రతిపక్షనేత ప్రజావేదిక కావాలని అడిగారని గుర్తుచేశారు. తమకు ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని హెచ్చరించారు.
'మేము అడిగినందుకే.. ప్రజావేదికను కూల్చేస్తున్నారు' - chandrababu
ప్రజావేదికను కూల్చివేయటాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. ప్రజల అవసరాలకోసం నిర్మించిన ప్రజావేదికను... ప్రభుత్వం అక్రమ కట్టడం అనటం సమంజసం కాదన్నారు. ఈ విషయంపై చర్చించడానికి అధినేత చంద్రబాబు నివాసంలో తెదేపా నేతలు సమావేశమయ్యారు.
'మేమడిగినందుకే..ప్రజావేదినకను కూల్చేస్తున్నారు'
దాడులను ఖండిచిన నేతలు
వైకాపా శ్రేణుల ఆగడాలు శృతిమించాయని తెదేపా నేతలు వాపోయారు. తమ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో కార్యకర్తలపై భౌతిక దాడులను నేతలు ఖండించారు. వారి ఆగడాలపై డీజీపీని కలిసి మెమెురాండం ఇవ్వాలని నిర్ణయించారు.