ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు వద్ద మ్యూజియం - MUSIUM

పోలవరం ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురికానున్న 12 మండలాల్లోని ఎన్నో పురాతన వస్తువులు ఉన్నాయి. వీటిని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వాటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేయనుంది.

పురాతన వస్తువులు

By

Published : Feb 6, 2019, 6:20 AM IST

పురాతన వస్తువులు
పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురికాబోతున్న గ్రామాల్లోని అలనాటి చారిత్రక ఆనవాళ్లను భద్రపరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాకతీయ, చోళుల కాలం నాటి ఆనవాళ్లుగా మిగిలిన శాసనాలు, విగ్రహాలు భద్రపరిచేందుకు ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేయనుంది.

పోలవరం ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురికానున్న 12 మండలాల్లోని ఎన్నో పురాతన వస్తువులు ఉన్నాయి. వీటిని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఆయా గ్రామాలల్లో పురావస్తు శాఖతో సర్వే చేపట్టి, 341 పురాతన విగ్రహాలు, 18 శాసనాలను గుర్తించారు. వీటిని ప్రస్తుతానికి రాజమండ్రి, ఏలూరు లో గల పురాతన వస్తు ప్రదర్శన శాలలో భద్రపరిచారు.
మరికొన్ని పురాతన వస్తువులు సేకరించేందుకు పురావస్తు శాఖ ప్రయత్నిస్తోంది. వీటన్నింటి ఒక చోట చేర్చి నాలుగున్నర కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయనున్న మ్యుూజియంలో భద్రపరుస్తారు.
ప్రాచీన సంపదను సంరక్షించేందుకు ప్రభుత్వం చూపుతున్న చొరవపై, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details