ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ

సార్వత్రిక సమరంలో కీలకఘట్టం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మెురాయించాయి. మరి కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి వరకూ సాగిన పోలింగ్ తర్వాత...అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్​లకు తరలించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ

By

Published : Apr 12, 2019, 2:36 AM IST


రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ...ఈవీఎంల మొరాయింపుతో కొన్నిచోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటు వేయాలని ఉదయాన్నే పోలింగ్‌ బూత్‌లకు వచ్చిన వారు.. ఈవీఎంల పనిచేయకపోవటంతో అసహనానికి గురయ్యారు. చాలా ప్రాంతాల్లో వాటిని మార్చేందుకు సమయం పట్టింది. ఈ నేపథ్యంలో పోలింగ్ ఆలస్యంగా ఆరంభమైంది. చాలా సమయం క్యూ లైన్లలో నిలబడిన తర్వాత.. సమస్య పరిష్కారం కావటంతో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ సాగింది. అనంతరం ఈవీఎం, వీవీప్యాట్లను అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ

ABOUT THE AUTHOR

...view details