ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన స్థాయిలోనే ఉంది'

కొత్త జిల్లాల ఏర్పాటు ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్ అన్నారు. శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

By

Published : Jul 17, 2019, 1:11 PM IST

శాసన మండలి లో మాట్లాడుతున్న మంత్రి పిల్లి సుభాష్​

శాసన మండలిలో మాట్లాడుతున్న మంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్​

పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో వెల్లడించారు. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపాదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాల ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సభ్యులు సూచించారు. కమిటీ ద్వారా అధ్యయనం చేయటం లేదా అఖిలపక్షం ద్వారా సలహాలు స్వీకరించాలని కోరారు.

ప్రత్యేకంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేసే క్రమంలో పరిపాలన సౌలభ్యంగా ఉండేలా జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేయాలని ఎమ్మెల్సీ సంద్యారాణి, సోము వీర్రాజు సూచించారు. గిరిజన నియోజకవర్గాలను కలిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, పూలే వంటి మహనీయుల పేర్లు పెట్టాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు సూచించారు.

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉందని మంత్రి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని జనాభా, భౌగోళిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం, ఆదాయం, సంస్కృతి, క్లిష్ట పరిస్థితులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సభ్యుల సూచనలు దృష్టిలో పెట్టుకుంటామని హామీ ఇచ్చారు.


ఇదీ చదవండి

చంద్రబాబూ... నన్ను బెదిరించొద్దు: సభాపతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details