తుపాను నష్టంపై తూర్పుకోస్తా రైల్వే అధికారుల సమీక్షించారు. ఫొని తుపాను కారణంగా రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు చెప్పారు. పూరీ-భువనేశ్వర్ - ఖుర్దా రోడ్‌లో నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. విశాఖ - చెన్నై మార్గంలో పాక్షికంగా రైళ్లు పునరుద్ధరించామనీ.. భువనేశ్వర్ - ఖుర్దా రోడ్ మార్గాన్ని పాక్షికంగా సిద్ధం చేశామని వివరించారు. ఈ మార్గంలో కొన్ని రైళ్లనే అనుమతిస్తున్నామని.. ఈ నెల 10 వరకూ పూరీకి వెళ్లే రైళ్లన్నీ నిలిపేశామనీ చెప్పారు.
ఫొనితో రైల్వేకు తీవ్ర నష్టం.. విమానయానంపైనా ప్రభావం - Flights
ప్రచండ తుపాను ఫొని ప్రభావం.. రైల్వేతో పాటు, విమానయానంపై తీవ్రంగా పడింది. తీరం దాటినా.. ఇంకా రాకపోకలు పూర్తి స్థాయిలో మెరుగుపడలేదు.
phoni effect
59 విమానాలు రద్దు
ఫొని తుపాను వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో పలు విమానాలు రద్దు చేశారు. గువాహటి నుంచి రాకపోకలు సాగించే 59 విమానాల రాకపోకలు నిలిపేశారు. అగర్తలా నుంచి 8 విమానాలు.. దిమాపూర్ నుంచి 2.. లీలాబరి నుంచి 2.. దిబ్రూగఢ్ నుంచి 4.. ఇంఫాల్ నుంచి రాకపోకలు సాగించే 6 విమానాలు రద్దు చేశారు.