ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిల్మ్‌సిటీలో మహిళల సందడి - ramoji

మహిళలు లేకపోతే ఈ సృష్టే లేదు. కుటుంబం కోసం నిత్యం శ్రమించే అతివలకు మహిళా దినోత్సవం పండుగ వంటిది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో వేడుకలు అందరిని అలరించాయి. ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ అదనపు సీపీ శిఖా గోయల్‌ హాజరయ్యారు.

ఫిల్మ్‌సిటీలో మహిళల సందడి

By

Published : Mar 8, 2019, 3:09 PM IST

ఫిల్మ్‌సిటీలో మహిళల సందడి

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సమసమాజ నిర్మాణం కోసం మహిళలు వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేసుకోవాలన్న నేపథ్యంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్ , రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ ఎండీ బృహతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రామోజీగ్రూపునకు చెందిన మహిళా ఉద్యోగులు కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి వేడుకలను అంబరాన్నంటించారు.
వనితల వేడుకలో ఉద్యోగుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పుల్వామా ఘటనపై చేసిన నృత్యరూప నాటిక ఆకట్టుకుంది.
రామోజీగ్రూప్‌ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుని నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి..... రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరీ, ఈటీవీ భారత్ ఎండీ బృహతి బహుమతులు ప్రదానం చేశారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వేడుకలు జరపడం పట్ల శిఖాగోయల్ హర్షం వ్యక్తంచేశారు. మహిళా దినోత్సవ సంబరాలు అద్భుతంగా జరిగాయన్న శిఖా గోయల్........ స్త్రీలేనిదే సృష్టిలేదని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యం పెరుగుతోందన్న ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరీ ... ప్రతి మహిళ సమసమాజ నిర్మాణం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మహిళా దినోత్సవ కార్యక్రమం తమలో నూతన ఉత్సాహాన్ని నింపిందని మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details