పోలవరంపై దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణ - national green tribunal
పోలవరంపై ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)లో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతుందంటూ గతంలో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
![పోలవరంపై దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3222333-477-3222333-1557303339046.jpg)
2005లో పర్యావరణ అనుమతులు ఇస్తే... ఈ పిటిషన్‌లో వాటినే సవాలు చేశారన్న ఎన్జీటీ... పర్యావరణ అనుమతులపై ఇంత ఆలస్యంగా అప్లికేషన్ వేశారని ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులిచ్చిన 90 రోజుల తర్వాత తాము జోక్యం చేసుకోలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులపై అభ్యంతరం ఉంటే 90 రోజులలోపే పిటిషన్ వేయాలన్న ఎన్జీటీ... ఇప్పుడు జోక్యం చేసుకోబోమని తెలిపింది. మత్స్యకారుల జీవనోపాధి అంశమైన పర్యావరణ అనుమతులపైనే సవాల్ చేశారన్న ఎన్జీటీ... పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చింది. మత్స్యకారుల అంశంపై ఇతర ఫోరమ్‌లను ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు సూచించింది.