ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్ కల్యాణ్​కు అప్పులు ఇచ్చింది ఎవరో తెలుసా..? - depts

తనకు పెద్దగా ఆస్తిపాస్తుల్లేవని తరచూ చెప్పే జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు అప్పు ఎంతుందో తెలుసా.. వ్యక్తిగతంగా ఆయన ఎవరెవరి దగ్గర ఎంత అప్పు తీసుకున్నారు...? సొంత వదిన సురేఖకు ఆయన ఎంత బాకీ.....? ఎన్నికల కమిషన్​కు పవన్ సమర్పించిన అఫిడవిట్‌లో ఉన్న ఆ ఆసక్తికర విశేషాలేంటి?

పవన్ కల్యాణ్​

By

Published : Mar 22, 2019, 1:06 PM IST

Updated : Mar 23, 2019, 6:41 AM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు.. నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్​లో స్టార్ హీరో పవన్​కల్యాణ్. సినిమాల్లో ఆయనకున్న స్థాయికి.. శ్రీమంతుడిగానే భావిస్తుంటాం.అయితే పవన్​​కు ఆస్తులెంతో అప్పులూ దాదాపు అంతే ఉన్నాయి. సుమారు 40కోట్ల ఆస్తులుంటే.. అందులో 33కోట్ల మేరకు అప్పులే ఉన్నాయి. ఎక్కువుగా తన స్నేహితులు.. సన్నిహితుల నుంచే వ్యక్తిగత రుణాలు పొందారు.

అప్పులిచ్చింది వీరే..

పవన్‌కు అప్పలిచ్చిన వారిలో ఆయన సన్నిహుతుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు. మాటలమాంత్రికుడిదగ్గర పవన్ 2 కోట్ల 40 లక్షల అప్పు పొందారు. తన మిత్రులు సన్నిహితులైన ప్రవీణ్ కుమార్ వద్ద 3 కోట్లు, నవీన్ కుమార్ వద్ద 5 కోట్ల 50 లక్షలు రుణం తీసుకున్నారు, ఎమ్వీఆర్​ఎస్ ప్రసాద్ వద్ద 2 కోట్లు అప్పుగా పొందారు. తన సొంత వదిన సురేఖకు పవన్ కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంది.

ఆస్తులు...ఖరీదైన కార్లు

పవన్ మొత్తం స్థిరాస్తులు 40 కోట్ల రూపాయలు. అదంతా పవన్ తన కష్టార్జితంగానే చూపెట్టారు. బ్యాంకుల్లో ఆయన పేరిట 12 కోట్ల రూపాయలు ఉన్నాయి. పనన్‌ వద్దఖరీదైన వాహనాలున్నాయి. వాటి కోసమే పవన్... బ్యాంకుల నుంచి 68 లక్షల రుణం పొందారు. సుమారు 73 లక్షల విలువ చేసేబెంజ్ కారు, కోటి రూపాయల విలువైన వోల్వో కారు, 32 లక్షల హార్లీ డేవిడ్​సన్ బైక్ ఉంది.

ఇవీ చదవండి

పవన్‌తో ముఖాముఖి

Last Updated : Mar 23, 2019, 6:41 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details