పసుపు-కుంకుమ రెండో విడుత - pasupu-kunkuma
రాష్ట్రప్రభుత్వం పసుపు-కుంకుమ రెండో విడత నిధులను విడుదల చేసింది.మార్చి 8వ తేదీతో ముందస్తుగానే చెక్లు ఇచ్చిన ప్రభుత్వం, రద్దీ నివారణకు, రేపటి నుంచి 10రోజుల్లో ఎప్పుడైనా చెక్లు బ్యాంకుల్లో జమ చేసుకుని, నగదు తీసుకునే వెసులు బాటు కల్పించింది.
పసుపు కుంకుమ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. 97లక్షల 8 వేల మంది మహిళలకు 3వేల500 రూపాయల చొప్పున,మొత్తం 3వేల4వందల23 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో సర్కారు జమ చేసింది. మార్చి 8, అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఈ నగదును తీసుకునే వెసులుబాటు కల్పించింది. మార్చి 8వ తేదీతో ముందస్తుగానే చెక్లు ఇచ్చిన ప్రభుత్వం, రద్దీ నివారణకు, రేపటి నుంచి 10రోజుల్లో ఎప్పుడైనా చెక్లు బ్యాంకుల్లో జమ చేసుకుని, నగదు తీసుకునే వెసులు బాటు కల్పించింది.